- Advertisement -
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన కారు మెట్రో పిల్లరు, డివైడర్‌ని ఢీకొని రోడ్డుకు అడ్డంగా నిలిచింది. కృష్ణానగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వెపు వెళ్తుండగా ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలు కాగా.. అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ కారు ప్రమాదం అక్కడ ఉన్న స్థానికులను భయాందోళనకు గురి చేసింది. కారు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
- Advertisement -