Thursday, January 23, 2025

కొండాపురం గనిలో ప్రమాదం

- Advertisement -
- Advertisement -
  • ఇద్దరు కార్మికులకు గాయాలు, ఒకరి పరిస్ధితి విషమం

మణుగూరు : మణుగూరు సింగరేణి ఏరియాలోని కొండాపురం భూగర్భ గనిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. సింగరేణి అధికారులు తెలిపిన వివరాల ప్రకార… కొండాపురం భూగర్భ గని యందు విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఎంఎస్ సంస్థకు చెందిన కార్మికులు మంగళవారం ఉదయం అండర్ గ్రౌండ్‌లో ఎల్‌హెచ్‌డి యంత్రాన్ని మరమత్తులు నిర్వహిస్తున్న సమయంలో గ్యాస్ సిలెండర్ పేలడంతో ఇద్దరు కార్మికులు గాయపడినట్లు తెలిపారు.

క్షతగాత్రుల్లో ఎస్‌ఎంఎస్ కంపెనీకి చేందిన ఘనశ్యామ్‌కు తీవ్రంగా గాయపడటంతో అతడిని స్థానిక సింగరేణి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలించినట్లు తెలిపారు. ప్రమాద సంఘటన తెలియగానే ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ ఏరియా ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరంగా ప్రమాదానికి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News