Saturday, February 22, 2025

ఎస్ఎల్బిసిలో కూలిన టన్నెల్ .. పది మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: మన్నెవారి పల్లి వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎల్బిసి సొరంగ తొవ్వకాల్లో విషాదం చోటు చేసుకుంది. టన్నెల్ నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో టన్నెల్ కూలి పది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఎల్బిసి ఎడమ వైపు ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాల్వ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు ఈ ప్రమాదం కారణంగా మూడు కిలోమీటర్ల వరకూ కప్పు కుంగిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ 50 మంది కార్మికులు ఉన్నారు. నిర్వాహకులు వెంటనే స్పందించి గాయపడిన వారిని జెన్‌కో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. సిఎం ఆదేశాలతో మంత్రులు జూపల్లి, ఉత్తమ్ పలువురు ఉన్నతాధికారులు ఘటనస్థలికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News