Monday, January 20, 2025

యమునానగర్‌ జాతీయ రహదారిపై ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హర్యానా: హర్యానాలోని యమునా నగర్‌లో పొగమంచు కారణంగా అంబాలా-యమునానగర్‌-సహరన్‌పూర్‌ జాతీయ రహదారిపై సుమారు 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది గాయపడగా,వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయి భారీ ట్రాఫిక్‌ జాం అయ్యింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాక చర్యలు చేపట్టారు. వాహనాల్లో ఇరుక్కుపోయ గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పై నుంచి తొలగించి రోడ్డుపై ట్రాఫిక్ ని క్లియర్ చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News