Wednesday, January 22, 2025

మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌కు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ములుగు జిల్లాలో పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఆమె కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం సంభవించింది. ఓ బొలెరో వాహనం అదుపు తప్పి మంత్రి కాన్యాయ్‌లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ములుగు జిల్లాలోని పస్రా- తాడ్వాయి మధ్యలో చోటు చేసుకుంది. ప్రమాదంలో మంత్రి సత్యవతి రాథోడ్‌కు ప్రమాదం తప్పడంతో ఆమె సిబ్బంది, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే,ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News