Wednesday, January 22, 2025

ప్రమాదవశాత్తు నివాస పూరి గుడిసె దగ్ధం

- Advertisement -
- Advertisement -

చేగుంట: చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ప్రమాద వశాత్తు నివాస పూరి గుడిసె దగ్ధం అయ్యింది. చందాయిపేట గ్రామానికి చెందిన పిట్ట ల కృష్ణ నివాస గుడిసె దగ్ధం కావడంతో అందులో ఉన్న డబ్బులు, బీరువా, బట్టలు,సామాగ్రి,నిత్యవసర సరకులు,కిరాణం, టీవి, ఫ్యాన్లు, మంచం అన్ని కాలి బూడిద అయ్యాయి. కాలిపోయిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అం డగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం నుండి సాయం వచ్చే విధంగా చూస్తానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News