Tuesday, November 5, 2024

హైబీమ్ లైట్ల వినియోగంతో ప్రమాదాలు

- Advertisement -
- Advertisement -

Accidents with the use of high beam lights

డిప్పర్ నిబంధను పాటించని వాహనదారులు
చూసిచూడనట్లు వదిలేస్తున్న అధికారులు

హైదరాబాద్: రాత్రి సమయాల్లో దారి చూపించే లైట్లే నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. పగటిసమయంలో మితిమీరన వాహనాల వేగం ప్రాణాలు తీస్తుంటే రాత్రి సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న హై బీమ్ లైట్లతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. హై వోల్టేజీ బల్బులతో ప్రధాన రహదారులపు మిరుమిట్లుతో వచ్చే విద్యుత్ కాంతులు ఎదురెదురు వస్తున్న వాహనాల ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. కేంద్ర మోటార్ వాహన చట్టం ప్రకారం ఉండాల్సిన ఆటోమెటిక్ టిప్పర్ వ్యస్థ సంవత్సరాలు గడుస్తున్నా అమలుకు నోచుకోక పోవడంతో ఇటువంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.గ్రేటర్‌లో జరుగుతున్న ప్రమాదాల్లో 15 శాతానికి పైగా హెడ్‌లైట్ల కారణంగానే జరుగుతున్నాయనే వినిపిస్తున్నాయని నివేదకలు తెలుపుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలపై పూర్తి స్థాయిలో పరిశోధనల జరగక పోవడంతోనే లైట్ల కారణంగా జరిగే ప్రమాదాలు వెలుగులోకి రావడం లేదు. గ్రేటర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు, ప్లై ఓవర్లు, ప్రదాన రహదారులపై జరుగుతూ రక్తపుటేరులను తలపిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణంగా హెడ్‌లైన్ల వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించడంలో రవాణాశాఖ అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.మోటారు వాహన చట్టం 125లోని నిబంధన ప్రకారం రాత్రిపూట వాహనాలను నడిపేటప్పుడు అవసరమైన చోట ఖచ్చితంగా డిప్పర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. వీటి కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనే కనీస అవగాహన వాహనదారులకు ఉండటం లేదు. వాస్తవానికి నగరంలో వీదిలైటు ఉండటంతో ఆ వెలుతురుల్లో రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి సమయాల్లో వాహన హైబీమ్ లైట్లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. కాని నిబంధనలను కనీసం పాటించక పోవడంతోనే ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి వాహనాలకు తెల్లని మిరుమిట్లు గొలిపపే ఎల్‌ఈడీ లైట్లతో ఎదుటి వారిని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఎల్‌ఈడిలైట్ల నుంచి వచ్చే తీవ్రమైన కాంతులు ఎదురుగా వచ్చేవాహనదారుల దృష్టిని మరల్చుతున్నాయి. వాహనాలు వేగంగా ఉండటంతో అదుపు తప్పి డివైడర్లను ఢీ కొట్టడం లేదా ముందు ఉన్న వాహనాన్ని ఢీ కొట్టడం వంటి సంఘటనలు జరుతుండంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అదనపు హంగులతో రహదారులపై వస్తున్న వాహనాలకు కొంత కాలంగా లెట్ ఎమిటింగ్ డయా లైట్లను (ఎల్‌ఈడి) బిగిస్తున్నారు. దీంతో ఈ లైట్లు రోడ్లపై విస్తారమైన కాంతిని వెదజల్లుతూ ఎక్కువ మొత్తంలో కాంతిని వెదజల్లుతున్నాయి. సాధారణ హలోజన్, హెడ్‌ఐడీ లైట్లు తక్కువ కాంతిని ఇస్తాయి. వాహనదారులు అధిక కాంతి కోసం ఎల్‌ఈడి లైట్లను వినియోగించడంతో వాటి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్ళలోకి సూటిగా పడటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు టిప్పర్‌ను వినియోగించడం లేదు.. రవాణశాఖ గతంలో బ్లాక్ ఫిల్మ్‌ను నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీనిద్వారా లైట్లను కొంత భాగాన్ని కప్పి ఉంచడతో ప్రమాదాలకు అంతగా అవకాశం లేకుండా పోయేది. అవసరాకి మించి లైట్లను వినియోగంచడం కూడా మోటారు వాహన చట్టం ప్రకారం నేరం దానికి రూ.1000 జరిమానా కూడా ఉంటుంది. దాన్ని కఠినంగా అమలు చేయక పోవడంతో ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News