Monday, January 20, 2025

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ కే మొగ్గు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలంగాణలో 42 శాతం ఓట్ల వాటా, 68 సీట్లను కాంగ్రెస్ గెలువబోతున్నది. కాగా బిఆర్ఎస్ 36 ఓట్ల శాతం వాటా, 39 సీట్లను గెలువనున్నది. తెలంగాణ అసెంబ్లీ 119 స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది.

పోలింగ్ ముగిశాక వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సాధించనున్నదని, బిఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోనున్నదని సూచించాయి. కాగా బిఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది. గత 10 ఏళ్ల పాలన, అభివృద్ధి ఆధారంగా తిరిగి అధికారంలోకి రావాలనుకుంటోంది. కానీ కాంగ్రెస్, బిజెపి మాత్రం అధికారం నుంచి బిఆర్ఎస్ ను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News