Monday, December 23, 2024

పథకం ప్రకారం వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: జనాల ను బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు డి మాండ్ చేస్తున్న వ్యక్తిని పథకం ప్రకారం హత్య చేశారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హ ఫిజ్ పేట్‌లో జరిగింది. డీఐ కాంత రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మహ్మద్ అఖిల్ (25) న్యూ హఫిజ్‌పేట్‌లోని ప్రే మ్‌నగర్ కాలనీలో నివాసముంటూ ఆ టో డ్రైవర్, ప్లండర్‌గా పని చేస్తున్నాడు. గతంలో కేపిహెచ్‌పి పోలిస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిని హత్య చేసి ఏడు నెలలు జైలు శిక్షను కూడా అనుభవించి బెయిల్‌పై బయటకి వచ్చాడు. అనంతరం హ ఫిజ్‌పేట్ పరిసరా ప్రాంతాలలోని ప్రజల ను బెదిరిస్తు డబ్బు బలవంతగా తీసుకోవడం, లేదంటే ఇం తకుముందు హత్యచేసినట్లు చంపుతానని బెదిరించ సాగాడు. ఈ క్రమంలో న్యూహఫిజ్‌పేట్‌కు చెందిన ఎండి ఫరీదుద్దీన్ (22), షేక్ ఆసిఫ్ (26), అస్లాం ఖాన్ (22), మహ్మద్ ఆబ్బా స్ (23), సమీర్ ఖాన్ (23), షేక్ హదీద్ (25) లు మొహమ్మద్‌ను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. నిం దితులు మొహమ్మద్ అఖిల్ ను చంపాడానికి కారం, సుత్త్తి, కత్తులు సమకూర్చుకున్నారు.

అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి జులై 1వ తేది మొహమ్మద్ అఖిల్ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండటంతో అ దును చూసిన నిందితులు హఫిజ్ పేట్ లోని కర్ణాటక చర్చ్ వద్ధకు మృతున్ని పి లిచి మాట్లాడుతున్న సమయంలో ఎండి ఫరుదుద్దీన్ కంట్లో కారంపొడి చల్లి ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. షేక్ ఆసిఫ్ మృతుని తలపై సుత్తితో గట్టిగా కొట్టగా మిగిలిన నిందితులు కత్తుల తో పొడిచారు. ఇది గమనించిన మృతుని స్నేహితు లు మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ నవాజ్‌లు అఖిల్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. నిందితులు వారిని కూడా చంపడానికి వెంబడించగా అక్కడి నుండి ఇద్దరు తప్పించుకున్నారు. మొహమ్మద్ అఖిల్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పో లీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయాగా నిందితులను సోమవా రం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలిసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News