Saturday, November 23, 2024

డీమాట్ అకౌంట్ నుంచి రూ. 2.73 కోట్లు స్వాహా!

- Advertisement -
- Advertisement -

ముంబై: ఓ షేర్ ట్రేడింగ్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల వ్యక్తి , క్లయింట్ ఖాతా నుంచి రూ. 2.73 కోట్లు స్వాహా చేశాడని ఆదివారం పోలీసులు తెలిపారు. కాగా అతడి యజమాని ఎంఆర్‌ఎ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది జనవరి ఫిర్యాదు దాఖలు చేయడంతో, నిందితుడిని కండివలి వెస్టర్న్ సబర్బ్‌లో ఆదివారం అరెస్టు చేశారు.

ఫిర్యాదు ప్రకారం ఓ వ్యక్తి ఓ షేర్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా డీమాట్ అకౌంట్‌ను తెరిచాడు. కాగా నిందితుడు అదే డీమాట్ అకౌంట్ మూలంగా తనకు సాయపడుతుండేవాడని పేర్కొన్నాడు. అయితే క్లయింట్ 2019 నుంచి 2021 వరకు తన ఖాతాలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేదు. కానీ అతని ఖాతా నుంచి రూ. 2.73 కోట్లు తుడుచుపెట్టుకుపోయాయని పోలీసులు తెలిపారు. కాగా పరారీలో ఉన్న నిందితుడి సమాచారం ఉప్పందగానే పోలీసులు పట్టుకున్నారు. కాగా ఈ నేరంలో భాగం ఉన్న మరో వ్యక్తి ఇంకా పరారీలోనే ఉన్నాడు. సెక్షన్ 420(మోసగించడం)కింద, ఐపిసి, సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News