Monday, December 23, 2024

అభివృద్ధిని ఓర్వలేకనే ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

ములుగు : నాడు జరిగే అభివృద్ధిలో నేడు రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎంఎల్‌ఏ సీతక్క చిల్లర వేషాలు వేస్తూ తప్పుడు సమాచారం ఇవ్వడం సరికాదని బిఆర్‌ఎస్‌లో ఉన్నవారు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఈ తప్పుడు సమాచారాన్ని మానుకోవాలని ఎంఎల్‌ఏ సీతక్కపై రెడ్‌కో చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జడ్పి చైర్మన్ కుసుమ జగదీశ్వర్ మృతిపై చాలా బాధాకరమని అన్నారు. 14 సంవత్సరాల నుండి ఉద్యమంలో పోరాడి తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్‌తో ఉంటు ములుగు జిల్లా నుండి జడ్పి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కానీ విధి వైపరీత్యం వలన ఆయన మృతి చెందడం పార్టీకి చాలా బాధాకరమని అన్నారు.

ఇది ఆసరాగా తీసుకున్న ఎంఎల్‌ఏ సీతక్క ములుగు జిల్లాలో చిల్లర వేషాలు వేస్తూ టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను కాంగ్రెస్ పార్టీలో వచ్చారని తప్పుడు సమాచారం ఇవ్వడం సరికాదని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని, అందువల్లనే ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఉత్సవాలపై ఎంఎల్‌ఏ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు 67 సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది సంవత్సరాల ప్రభుత్వ పాలనలో అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు.

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసి జాతీయ గీతం పాడుతారు. అప్పుడు ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ ఇప్పటి వరకు రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు రైతులకు రెండు పంటలకు కోట్ల ఖర్చుతో సాగునీరు అందించిన ఘనత కెసిఆర్‌దేనని, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటుచేసిన అనంతరం కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో రైతులకు త్రిఫేజ్ విద్యుత్ 24గంటల, గ్రామాలలో విద్యుత్ పోకుండా కంటిన్యూగా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు.
మిషన్ కాకతీయ పనుల వలన ఎండాకాలంలో కూడా నిండుకుండలా చెరువులు
రాష్ట్రంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి ఆ కార్యక్రమంలో కోట్ల ఖర్చుతో చెరువులకు, గుంటలకు పునరుద్దరణ పనులను చేపట్టి వేసవికాలంలో కూడా చెరువులో నీళ్లు ఉండే విధంగా దేవాదుల నీరును ప్రాజెక్టుల ద్వారా అందించడం జరుగుతుందని, అందువల్లనే రాష్ట్రంలో రైతులు రెండు పంటలు పండిస్తూ అధిక దిగుబడిని రైతులు పండిస్తున్నారన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో వరి పండి ఇవ్వకుండా ఉంటారు.

మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. రాబోయే 2024లో ములుగు జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఏ బిఆర్‌ఎస్ పార్టీకి బలంగా ఉందని భయంతో తప్పుడు సమాచారం ఇస్తుందని సూచించారు. 2024లో మరల బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వమే ములుగు జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌కు బుద్ది చెబుతారని హెచ్చరించారు.

ఇకనైనా తప్పుడు సమాచారాలు ఇస్తే సహించేది లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్‌నాయక్, వెంకటాపూర్ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, సీనియర్ నాయకులు మల్క రమేష్, గై అశోక్, బుర్ర లింగయ్య, కూరెళ్ళ రామాచారి, డిసిసిబి డైరెక్టర్ మాల్గుల రమేష్, బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News