కమ్మర్‌పల్లి : బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే మంత్రి పై అసత్య అరోపణాలకు పాల్పడుతున్నరని కమ్మర్‌పల్లి మండల బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో మండల బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ. మంత్రి ప్రశాంత్‌రెడ్డి పై విమర్శలు చేస్తే వారి పార్టీల్లో ఎమ్మేల్యే టికెట్ దక్కుతుందని మానాల మోహన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, సునీల్‌రెడ్డి అసత్య అరోపణాలు చేస్తున్నారని దేవేందర్ విమర్శించారు. గతంలో ఎమ్మేల్యేలు గా ఉన్న వారి హయాంలో ఎవరు పనులు చేశారో చేప్పలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు అసత్య ఆరోపణాలకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. మాజీ ఎమ్మేల్యే అన్నపూర్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అదే కాంట్రాక్టర్ రహదారులు నియమించిన విషయాన్ని మర్చిపోయార అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో 60ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులను 4 సంవత్సరాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసి చూపించిన విషయాన్ని కాంగ్రెస్, బిజెపి జీర్ణించుకోలేక చౌకబారు అరోపణలకు సాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గడ్డం స్వామి, మారు శంకర్, పుప్పాల గంగాధర్, ఎంపిటిసి మైలారం సుధాకర్, బద్దం రాజేశ్వర్, మల్యాల సుభాష్‌గౌడ్, మలావత్ ప్రకాష్, సంత రాజేశ్వర్, హల్దె శ్రీనివాస్, తీగల హరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రి పై ఆరోపణలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -