Friday, December 27, 2024

అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యేపై ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: రామగుండం నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై కాంగ్రెస్ నాయకులు మక్కాన్‌సింగ్ ఆరోపణలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ రామగుండం నియోజకవర్గ నాయకులు తానిపర్తి గోపాల్ రావు, జెవి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం స్థానిక ప్రధాన చౌరస్తాలోని బిఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత 60 ఏళ్ల కాలంలో జరగని అభివృద్ధి, ఎమ్మెల్యే చందర్ నేతృత్వంలో కేవలం నాలుగున్నర ఏళ్లలో జరగడాన్ని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు.

చందర్‌పై ప్రజల్లో నానాటికి పెరుగుతున్న అభిమానాన్ని తట్టుకోలేక, ఓటమి భయంతోనే మక్కాన్‌సింగ్ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ప్రజల దశాబ్దాల చిరకాల వాంఛ అయిన మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టార్ కార్యాలయం, కోర్టు భవన సదుపాయంతోపాటు నియోజక వర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చందర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు.

జిల్లాలో ఏర్పాటు కావాల్సిన మెడికల్ కళాశాలను సిఎం కెసిఆర్‌ను ఒప్పించి, మెప్పించి నియోజక వర్గంలో ఏర్పాటు అయ్యేలా ఎమ్మెల్యే చందర్ కృషి చేశారని అన్నారు. స్థానిక యువత ఉపాధి కోసం తనవంతు బాధ్యతగా ఎమ్మెల్యే చందర్ అమెరికాకు వెళ్లి అక్కడి ఐటి పారిశ్రామిక వేత్తలతో సమావేశమై సానుకూల స్పందనను తీసుకు వచ్చారని అన్నారు.

మొక్కవోని పట్టుదలతో నియోజక వర్గానికి పట్టుదలతో నియోజక వర్గానికి మెడికల్ కళాశాల తీసుకు వస్తే కాంగ్రెస్ నాయకులు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారే తప్పా, ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచన చేయకపోవడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు.

అభివృద్ధి ప్రదాత రామగుండం ఎమ్మెల్యేపై చౌకబారు ఆరోపణలు మానుకోకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కో ఆప్షన్ మెంబర్ వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు నడిపల్లి మురళీధర్ రావు, తోడేటి శంకర్ గౌడ్, అడ్డాల రామస్వామి, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, జావిద్ పాషా, చెలుకలపల్లి శ్రీనివాస్, గుంపుల ఓదెలు యాదవ్, మేడి సదానందం, నీరటి శ్రీనివాస్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News