Friday, December 20, 2024

శ్రద్ధాహత్యానేరం అఫ్తాబ్ అంగీకరించలేదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను తాను హత్య చేసినట్టు ఆరోపించిన నేరాన్ని నిందితుడు అఫ్తాబ్ కోర్టులో అంగీకరించలేదని అఫ్తాబ్ తరఫు న్యాయవాది అవినాష్ కుమార్ వెల్లడించారు. ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆయన వివరాలు తెలియజేశారు. అఫ్తాబ్‌కు వ్యతిరేకంగా నమోదైన ఈ కేసు చాలావరకు సందర్భోచిత సాక్షంతో కూడుకున్నదని, అది అతనికి సహకరిస్తుందని చెప్పారు.

అఫ్తాబ్ ఢిల్లీ పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తున్నారు తప్ప కోర్టులో తాను హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించలేదని న్యాయవాది అవినాష్ కుమార్ వివరించారు. ఘటన సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు కూడా న్యాయస్థానం ఎదుట ఒప్పుకేలేదని తెలిపారు. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు అతడ్ని కలిసేందుకు అనుమతి కోరగా కోర్టు అంగీకరించినట్టు న్యాయవాది అవినాష్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News