Wednesday, January 22, 2025

నిరుద్యోగిని మోసం చేసిన నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.60లక్షలు వసూలు
ముగ్గురు నిందితుల మోసం
అరెస్టు చేసిన ఆసిఫ్‌నగర్ పోలీసులు

Accused arrest cheating unemployed

మనతెలంగాణ, సిటిబ్యూరో: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరు నిందితులను ఆసిఫ్‌నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం…ఆసిఫ్‌నగర్‌కు చెందిన దినేష్ ఎంబిఏ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న గుడిమల్కాపూర్‌కు చెందిన శ్రీహర్ష పరిచయమయ్యాడు. అతడి స్నేహితుడు అనిల్ డిటిపి వర్క్ చేస్తున్నాడు. శ్రీహర్ష, అనిల్, వెంకటేశం ముగ్గురు స్నేహితులు. ముగ్గురు కలిసి దినేష్‌కు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. దానికి డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పడంతో దినేష్ వారికి రూ.1.60లక్షలు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న నిందితులు బాధితుడికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు. దానిని దినేష్ పరిశీలించగా నకిలీగా తెలిసింది. వెంటనే బాధితుడు ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి శ్రీహర్ష, అనిల్‌ను అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ.97,500 నగదు, ల్యాప్‌టాప్, స్కానర్, నాలుగు నకిలీ ఆఫర్ లెటర్లు, సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఆసిఫ్ నగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News