Sunday, December 22, 2024

కీచక ప్రేమికుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Accused arrest who took nude photos of young woman he loved

మనతెలంగాణ, హైదరాబాద్ : కీచక ప్రేమికుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్, బషీర్‌బాగ్‌కు చెందిన అబ్దుల్ ఫయాజ్ అదే ప్రాంతానికి చెందిన యువతి(18)ని 2021వరకు ప్రేమించాడు. యువతితో శారీరకంగా సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమెకు తెలియకుండా న్యూడ్ ఫోటోలు తీశాడు. వాటిని యువతికి చూపించి పలుమార్లు అత్యాచారం చేశాడు. తరచూ న్యూడ్ ఫొటోలను చూపించి యువతిని బెదిరిస్తుండడంతో బాధితుల ఫిర్యాదు మేరకు 2021లో నాంపల్లి, నారాయణగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు, మూడు నెలల జైలులో ఉన్న నిందితుడు బెయిల్‌పై బయటికి వచ్చాడు. బయటికి వచ్చినా నిందితుడు ప్రవర్తన మార్చుకోకుండా యువతి నగ్న ఫొటోలు ఆమె కుటుంబ సభ్యులకు పంపించడమే కాకుండా వారిని బెదిరించాడు. దీంతో వారు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News