Monday, December 23, 2024

కేరళ ప్రొఫెసర్ చేయి నరికివేత.. 13 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేరళ ప్రొఫెసర్ చేతిని నరికివేసిన కేసులో ఆఖరి నిందితుడిని ఎట్టకేలకు నేరం జరిగిన 13 సంవత్సరాల తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) బుధవారం అరెస్టు చేసింది. కేరళలోని ఇదుక్కి జిల్లా తొడుపుళాలో న్యూమ్యాన్ కాలేజ్‌కి చెందిన బికాం విద్యార్థుల ఇంటర్నెల్ ఎగ్జామ్ కోసం తయారుచేసిన ప్రశ్నాపత్రంలో మొహమ్మద్ ప్రదక్తకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై ప్రొఫెసర్ టిజె జోసెఫ్ కుడి చేతిని నిషిద్ధ పాపులర్ ఫ్రంగ్ ఆఫ్ ఇండియా కార్యకర్త సావద్ నరికివేశాడు.

అతని తలపై రూ. 10 లక్షల రివార్డును కేరళ పోలీసులు గ్రతంలో ప్రకటించారు. ఎట్టకేలకు బుధవారం కేరళలోని కన్నూర్ జిల్లా మట్టన్నూర్‌లో ఎన్‌ఐఎ అధికారులు సావద్‌ను అరెస్టు చేశారు. 2010 జులై 4వ తేదీ ఆదివారం ఉదయం చర్చిలో ప్రార్థనలు ముగించుకుని కుటుంబ సభ్యులతో కలసి ఇంటికి తిరిగివస్తున్న ప్రొఫెసర్ జోసెఫ్‌పై దాడి జరిగింది. దాడికి పాల్పడిన నిందితులు అక్కడి నుంచి పారిపోయే ముందు బాంబు కూడా విసిరారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం తయారుచేసిన ప్రశ్నాపత్రంలో మొహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాము శిక్షిస్తున్నామంటూ వారు ప్రొఫెసర్‌కు చెప్పారు.

ఎర్నాకుళం జిల్లాలో అదే రోజు పోలీసులు కేసు నమోదు చేయగా తదనంతరం కేసును ఎన్‌ఐఎ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటివరకు 19 మంది నిందితులకు శిక్ష పడింది. వీనిలె మేగేకగనిరి చావజ్జీవ కారాగార శిక్ష విధించగా మరో 10 మందికి 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. నిందితులందరూ నిషిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ) నాయకులు లేదా కార్యకర్తలు కావడం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన సావద్‌పై 2011 జనవరి 10న చార్జిషీట్ దాఖలు కాగా నేరం జరిగిన 13 ఏళ్ల తర్వాత నిందితుడు అరెస్టు అయ్యాడు. దేశంలో హింసాత్మక తీవ్రవాద కార్యకలాపాలకు ఈ ఘటనతోనే బీజం పడిందని చెప్పవచ్చు. పిఎఫ్‌ఐపై నిషేధం విధించడానికి దారితీసిన ఘటనలలో ఇది కూడా ఒకటి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News