Thursday, January 23, 2025

హత్య చేసిన 40 ఏళ్ల తరువాత సొంత ఆస్తి పట్టించింది….

- Advertisement -
- Advertisement -

 

లక్నో: బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన 40 ఏళ్ల తరువాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 1982లో ఖేరగఢ్ గ్రామంలో ఆత్రమ్ (61) అనే వ్యక్తి తన సోదరుడు లాయర్ రాఘవేంద్ర సింగ్, తన స్నేహితుడు చంద్రబాన్ అనే వ్యక్తితో కలిసి హరేంద్ర సింగ్ అనే బాలుడిని కిడ్నాప్ చేసి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు.. హరేంద్ర సింగ్ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో బాలుడిని చంపేసి పారిపోయారు. మర్డర్ జరిగిన ఏడు రోజుల తరువాత బాలుడి మృతదేహం పోలీసులు లభించడంతో కేసు నమోదు చేసి రాఘవేంద్ర, చంద్రబాన్ అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

Also Read: పక్కింట్లో శృంగారం … నాకు నిద్రపట్టడం లేదు.. ట్విట్టర్‌లో లేఖ వైరల్

ఆత్రమ్ మాత్రం అప్పటి నుంచి పరారీలో ఉండడంతో ఎక్కడ అతడి ఆచూకీ కనిపించలేదు. యుపిలో మర్డర్ చేసి ఢిల్లీకి మకాం మార్చాడు. ఢిల్లీలో ఓ మహిళను పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడు. పూర్వీకుల ఆస్తి కావాలని ఆశ పుట్టడంతో ఓ లాయర్ సహాయంతో ఆత్రమ్ కేసు వేశాడు. లాయర్ నుంచి నోటీసు రావడంతో ముగ్గురు అన్నదమ్ములలో ఒకరు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే ఆత్రమ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆత్రమ్ రెండు మూడు ప్రదేశాలలో జీవనం సాగించడంతో పాటు ఫేక్ ఐడి కార్డుతో సృష్టించడంతో పోలీసులకు దొరకలేదు. ఢిల్లీలోని హౌస్ ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News