Sunday, December 22, 2024

అమెరికా తీసుకు వెళ్తానని ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

విదేశాలకు పంపిస్తానని చెప్పి యువతి వద్ద నుంచి కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు పాస్‌బుక్‌లు, పది డెబిట్ కార్డులు, మూడు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మదీనాగూడకు చెందిన యువతి(30) నవంబర్, 2023న షాదీ. కామ్ మ్యాట్రామోని వెబ్‌సైట్‌లో ఎపిలోని విజయవాడ జిల్లా, పెనుమలూరు మండలం, పోరంకి గ్రామానికి చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణ(37) అనే వ్యక్తి రిషికుమార్ పేరుతో పరిచయమయ్యాడు. తాను గ్లెన్మార్క్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. ఇద్దరు కలిసి కొద్ది రోజులు వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకున్నారు. వివాహం చేసుకునేందుకు ఇద్దరు నిర్ణయించుకున్నారు.

వివాహం చేసుకున్న తర్వాత యువతిని అమెరికా తీసుకుని వెళ్తానని చెప్పాడు, అయితే అమెరికా పార్ట్‌నర్ వీసా కోసం సిబిల్ స్కోర్ 850 ఉండాలని చెప్పాడు. కానీ యువతికి సిబిల్ స్కోర్ 743 ఉండడంతో తక్కువగా ఉందని, అమెరికా వెళ్లేందుకు సిబిల్ స్కోర్ పెంచేందుకు కంపెనీ నుంచి రుణాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమెకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత క్రెడిట్ కార్డు,డెబిట్ కార్డుల ద్వారా రుణాలు ఆమె పేరుతో తీసుకుని వచ్చిన డబ్బులను, పలు దఫాలుగా ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.2,71,79,044 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. తర్వాత నుంచి నిందితుడు స్పందించడం మానివేశాడు. అంతేకాకుండా బాధితురాలి సోదరికి ఆస్ట్రేలియాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. మైక్రోసాఫ్ట్ బోర్డుమెంబర్‌గా పనిచేస్తున్న నిర్మలా తనకు సోదరి అవుతుందని చెప్పాడు. తర్వాత నుంచి నిందితుడు స్పందించడం మానివేశడు.

దీంతో తాను మోసపోయానని గ్రహించి బాధితురాలు ఈ నెల 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు వంశీకృష్ణను అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు అలవాటు పడ్డ నిందితుడు మ్యాట్రిమోని వైబ్‌సైట్‌లో పలు పేర్లతో ప్రొఫైల్ పెట్టి వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేస్తున్నాడు.బాధిత యువతుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాడు. నిందితుడి చేతిలో మోసపోయిన బాధితులు హైదరాబాద్, చైతన్యపురి, సైబరాబాద్, విజయవాడ, నార్సింగి, రామగుండం, సిసిపిఎస్ హైదరాబాద్, చెన్నైలో కేసులు పెట్టారు. ఇన్స్‌స్పెక్టర్ రమేష్ కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News