Friday, December 20, 2024

హత్య కేసు చేధించిన పోలీసులు..

- Advertisement -
- Advertisement -

మాచారెడ్డి : మహిళ హత్యకు సంభందించినటు వంటి కేసును మాచారెడ్డి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చేధించారు. కేసు విశయాలను ఎస్ఐ సంతోష్ కుమార్ విలేఖరులకు గురువారం వెళ్లడించారు. జనవరి 28 రోజున గజ్జనాయక్ తాండా గ్రామ శివారులో ఒక మహిళ మృతదేహం ఉందన్న సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి గుర్తింపు కోసం సీసీ ఫుటేజీని పరిశీలించగా మృతి చెందిన మహిళ గంబీరావుపేట్ మండలం గోరింటాల గ్రామానికి చెందిన గాదం వెంకటవ్వ, భర్త రమేష్ 48 గా గుర్తించారు.

హత్య కేసు చేధించే విషయంలో హంతకుల ఆదారాల కోసం సీసీ ఫుటేజిలను పరిశీలించారు. మృతి చెందిన వెంకటవ్వతో పాటు ఇద్దరు వ్యక్తులు సిరిసిల్ల కామారెడ్డి రహదారి వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. సీసీఫుటేజి ఆధారంగా పట్టుకున్న హంతకులు గంబీరావుపేట్ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన మంద దేవయ్య, అలకుంట్ల సాయిలు గా గుర్తించారు. ఇద్దరు హంతకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. హత్య కేసు చేధించిన ఎస్సై సంతోష్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News