Sunday, December 22, 2024

ముకేష్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్: తెలంగాణవాసి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్స్ పంపించాడన్న ఆరోపణలపై తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తెలంగాణలో అరెస్టు చేసి ఇక్కడి కోర్టులో హాజరుపరిచినట్లు గందేవి పోలీసులు తెలిపారు. నవంబర్ 8 వరకు నిందితుడికి పోలీసు కస్టడీ విధించినట్లు వారు చెప్పారు.

అక్టోబర్ 31న ముకేష్ అంబానీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి మూడోసారి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. రూ. 400 కోట్లు చెల్లించకపోతే చంపివేస్తామంటూ ఆ ఈమెయిల్‌లో గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు. దీనికి కొద్ది రోజుల ముందు ముకేష్ అంబానీకి వరుసగా రెండు ఈమెయిల్స్ వచ్చాయి.

మొదటి ఈమెయిల్‌లో రూ. 20 కోట్లు డిమాండు చేసిన ఆగంతకుడు రెండవ ఈమెయిల్‌లో రూ.40 కోట్లు డిమాండ్ చేశాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గందేవి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిందితుడి అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News