హైదరాబాద్: నగరంలోని కెబిఆర్ పార్క్ వద్ద సినీ నటి ఛౌరాసియాపై జరిగిన దాడి కేసును పోలీసులు ఛేదించారు. శనివారం ఉదయం పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వివరించారు. ”నిందితుడిని మహబూబ్ నగర్ జిల్లాకు కుల్కచర్ల చెందిన కొమ్ము బాబుగా గుర్తించాం. మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినా బాబు.. సినిమా షూటింగ్ లలో సెట్ వర్కర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్నాడు. సెట్ వర్కర్ గా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో చోరీలకు పాల్పడుతున్నాడు. కేబీఆర్ పార్క్ ఔటర్ ట్రాక్ అడ్డాగా దోపిడీలకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం నటి చౌరాసియాపై దాడి చేసి మొబైల్ అపహరించుకుని వెళ్ళాడు. ఈ దాడికి ముందు కేబీఆర్ పార్క్ లో పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన చౌరాసియా పార్క్ లోకి వాకింగ్ కు వచ్చింది. అప్పటికే రెక్కీ నిర్వహించిన నిందితుడు బాబు చీకటి ప్రదేశంలోకి రాగానే ఆమెను వెనుక నుండి గట్టిగా పట్టుకుని ఆమె అరవకుండా నోరు మూసాడు. ఆమె గట్టిగా ప్రతిఘటిస్తున్న సమయంలో ఆమె తలను బండరాయితో కొట్టే ప్రయత్నం చేసాడు. ఆమెపై దాడి చేసి ఐఫోన్ లాక్కెళ్లాడు. చోరీ అనంతరం కేబీఆర్ పార్క్ ఫెన్సింగ్ దాటి బయటకు వెళ్లిపోయాడు.
బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసును ఛేదించడానికి సంయుక్తంగా పని చేశారు. ఘటన స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని పట్టుకోవడం అలస్యం అయింది. ఘటన జరిగిన రోజు ఏ సీసీ కెమెరాల్లో నిందితుడు క్యాప్చర్ అవ్వలేదు. గత మూడు సంవత్సరాల స్నాచర్స్ డేట తెప్పించుకుని లిస్ట్ ఔట్ చేశాం. జైల్లో ఉన్నవాళ్ళను ఎలిమినెట్ చేసి, బయట ఉన్న స్నాచర్స్ ను తీసుకువచ్చి వారిని విచారించాం. సుమారు 70 నుండి 80 మందిని విచారించాం. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ కు కూడా వెళ్లి విచారించాం. గోల్కొండలో బాబుపై చోరీ కేసు నమోదు అయింది.. దాని ఆధారంగా కేసును ఛేదించాం. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కేసును ఛేదించాం. కేవలం 20 శాతం మాత్రం టెక్నీకల్ ఆధారాల మీద ఆధార పడ్డాం. 50మంది పోలీసులు 5 రోజులు వర్కౌట్ చేస్తే కేసును ఓ కొలిక్కి తీసుకు రాగాలిగాం. ఆ టైంలో ఎవరు వస్తే వారిని దోపిడీ చేద్దాం అని భావించాడు. ఆ సమయంలో బాధితురాలు వచ్చింది… ఆమెను చోరీ చేసి పారిపోయాడు” అని పోలీసులు వివరించారు.
Accused Arrested in Actress Chaurasia attack Case