Sunday, December 22, 2024

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బార్ అండ్ రెస్టారెంట్ పార్కింగ్‌లో గొడవ
అరెస్టు చేసిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః బార్ అండ్ రెస్టారెంట్‌లోని పార్కింగ్‌లో గొడవపడి హత్యాయత్నం చేసిన ఇద్దరు యువకులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, బార్కాస్‌కు చెందిన షేక్ సాజిద్ అలియాస్ సాజిద్ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు, భవానీ నగర్‌కు చెందిన షేక్ అమీర్ అలియాస్ అమ్మూ అలియాస్ ఎటిఎం ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఇద్దరు నిందితులు పాతబస్తీకి చెందిన వారు, ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. షేక్ సాజిద్‌పై బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. తొమ్మిది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. షేక్ అమ్మూపై మూడు కేసులు ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన ఇద్దరు నిందితులను కలిసి మొఘల్‌పుర, నాగులచింత ఎక్స్ రోడ్డులోని వై5 బార్ అండ్ రెస్టారెంట్‌కు మద్యం తాగేందుకు వెళ్లారు. అదే బార్‌లో పవన్ రూప్‌నర్ మద్యం తాగి పార్కింగ్‌లో ఉన్న వాహనం వద్దకు వచ్చాడు. అక్కడికి వచ్చిన ఇద్దరు నిందితులు పవన్‌తో వాగ్వాదానికి దిగారు.

వెంటనే కత్తితో ఇద్దరు కలిసి పవన్‌పై దాడికి దిగడంతో గాయాలయ్యాయి. దాడి చేస్తుండగా అక్కడికి వచ్చిన బార్‌లో పనిచేస్తున్న సాయిప్రసాద్ నిందితుల బారి నుంచి పవన్‌ను రక్షించేందుకు యత్నించడంతో అతడిపై కూడా దాడి చేయడంతో గాయాలయ్యాయి. బాధితులు ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. దాడి చేసిన తర్వాత నిందితులు పరారయ్యారు. ఇన్స్‌స్పెక్టర్ షేక్‌జాకీర్ హుస్సేన్, ఎస్సైలు నర్సింహులు, ఆంజనేయులు, నవీన్ కలిసి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం మొఘల్‌పుర పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News