Thursday, January 23, 2025

హత్య కేసులో నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదని యువకుడిపై దాడి చేసి హత్య చేసిన నిందితులను ఐఎస్ సదన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి కారు, రెండు బైక్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌ఈస్ట్ జోన్ డిసిపి రూపేష్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని మల్లేపల్లికి చెందిన ఖాజా నయిముద్దిన్, మహ్మద్ సలీం, ఖాజా ఫరీద్ ఉద్దిన్, మహ్మద్ ఫహద్ ఖాన్, డప్పుల హరిప్రసాద్, గులాం మహ్మద్ ఖాన్, మహ్మద్ అబ్దుల్ రెహ్మన్, మహ్మద్ అక్బర్‌హుస్సేన్, సలాఉద్దిన్ కలిసి యువకుడిని హత్య చేశారు. ఇందులో సలాఉద్దిన్ పరారీలో ఉన్నాడు. సంతోష్‌నగర్, భాను నగర్‌కు చెందిన ఎండి రిజ్వాన్ వ్యాపారం చేస్తున్నాడు.

మహ్మద్ సలీం వద్ద రూ.33లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో సలీం పలుమార్లు నిలదీశాడు. అయినా కూడా బాధితుడు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో రిజ్వాన్‌ను ఖజానయిముద్దిన్, సలీం కలిసి ఇంటి నుంచి ఈనెల 11వ తేదీన కిడ్నాప్ చేసి కారులో బజారఘాట్‌లోని ఆఫీస్‌కు తీసుకుని వచ్చారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా డబ్బులు ఎక్కడ పెట్టింది చెప్పలేదు. దీంతో అందరూ కలిసి రిజ్వాన్‌పై కర్రాలతో దాడి చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే అని రిజ్వాన్‌కు వార్నింగ్ ఇచ్చారు, దీంతో రిజ్వాన్ వారిని తిట్టడం ప్రారంభించాడు. మళ్లీ కాళ్లు, చేతులపై దాడి చేసి అతడి ఇంటికి తీసుకుని వెళ్లారు. అక్కడ రిజ్వాన్ తండ్రికి విషయం చెప్పడంతో అతడు 13వ తేదీన రూ.2లక్షలు నిందితులకు పంపించాడు.

మిగతా డబ్బులు రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని వార్నింగ్ ఇచ్చి రిజ్వాన్‌ను ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన రిజ్వాన్‌ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. రిజ్వాన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్‌స్పెక్టర్ మల్లేష్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News