25 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్ పట్టుకున్న పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: నిషేధిత గంజాయిని విక్రయించేందుకు గతంలో ప్రయత్నించి నిందితుడిని బేగంపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నార్త్‌జోన్ డిసిపి చందనాదీప్తి తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బేగంపేట పోలీసుల కథనం ప్రకారం…మహారాష్ట్ర, వార్ధాజిల్లా, జునాపుల్‌గాన్ గ్రామానికి చెందిన సల్మాన్ ఖాన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 26, జూలై, 2021న నిందితుడు రాత్రి 1.30 గంటలకు నాలుగు బకెట్లలో 25కిలోల గంజాయిని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలించేందుకు వచ్చాడు. ట్రావెల్స్ బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ వాటిలో ఏమి ఉందని ప్రశ్నించాడు. దీనికి సరిగా సమాధానం ఇవ్వని నిందితుడు బస్సు దిగి పారిపోయాడు. డ్రైవర్ బకెట్ల మూతను ఓపెన్ చేసి చూడగా గంజాయి ఆకులు ఉన్నాయి. వెంటనే కాంకర్ ట్రావెల్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న జవహర్‌నగర్‌కు చెందిన సయిద్ అతీకుద్దిన్ సర్‌మాస్ట్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి నిందితుడి కోసం వెతుకుతున్నారు. కాల్ డాటా ఆధారంగా నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు పట్టుకున్నారు.