హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ పరిధిలోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ విద్యార్థినుల ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వాట్సాప్ డిపి ఫోటోలను మార్ఫింగ్‌చేసి బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై చర్యలు కోరుతూ కళాశాలల విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
అయితే అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడిన కేటుగాళ్ల కేస్ లో పోలీసులు పురోగతి సాధించారు. విజయవాడలో నిందితుడు పట్టుబడడంతో నిందితులు ప్రదీప్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరబాద్ కు తరలించారు. మరి కొంత మంది నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రదీప్ ఫోటోలు మార్పింగ్ తో పాటు మొబైల్ లో ఉన్న పర్స్ నల్ డేటాను కూడా సేకరించాడని తెలిపారు. 7 నంబర్లతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.