Thursday, January 23, 2025

రియల్టర్ హత్య కేసులో నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

అంతరాష్ట్ర కిరాయి హంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తండ్రిని హత్య చేశాడని కుమారుడి ప్రతీకారం
కర్నాటకకు చెందిన కిరాయి ముఠాకు రూ.30లక్షలు సుపారీ ఇచ్చిన నిందితుడు
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్

మనతెలంగాణ, హైదరాబాద్ : రియల్టర్ హత్య కేసులో అంతరాష్ట్ర కిరాయి హంతకులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి నాలుగు వేట కొడవళ్లు, మూడు కత్తులు, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సిపి మహేష్ భగవత్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా, కాప్రా మండలం, చిక్రీపురానికి చెందిన అంబటి రాఘుపతి అలియాస్ రఘు ఈ నెల 15వ తేదీ రాత్రి 8.30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు దమ్మాయిగూడ, శివనగర్‌లోని ఎన్‌విఆర్ వైన్స్ వద్ద కత్తులతో పొడిచి హత్య చేశారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులపై 147,148,12(బి),307,302, రెడ్‌విత్ 149 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మేడ్చెల్‌జిల్లా, కీసర మండలం, దమ్మాయిగూడ, పిఎస్ రావు నగర్‌కు చెందిన సురకాంటి శ్రీకాంత్ రెడ్డి వ్యాపారం చేస్తున్నాడు.

కర్నాటక, శివమోగ్గకు చెందిన ఈ. మంజునాథ్ మెటీరియల్ వ్యాపారం చేస్తున్నాడు, మహ్మద్ సిద్దిఖ్ అలియాస్ రహద్ ప్లైవుడ్ పనిచేస్తున్నాడు, ఇస్మాయిల్ టైల్స్ వర్కర్, సమీర్ ఖాన్ అలియాస్ షేక్, మేడ్చెల్ జిల్లా, కాప్రా మండలం, సాయిబాబానగర్‌కు చెందిన కవాడి రాజేష్‌ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి తండ్రి జంగారెడ్డి 2009లో హత్యకు గురయ్యాడు. తనను అందరిముందు జంగారెడ్డి అవమానం చేశాడని కక్ష పెంచుకున్న రఘుపతి హత్య చేశాడు. దీంతో రఘుపతిపై కక్ష పెంచుకున్న శ్రీకాంత్ రెడ్డి తన తండ్రిని హత్య చేసిన రఘుపతిని ఎలాగైనా హత్య చేయించాలని ప్లాన్ వేశాడు. ఇందుకు అవకాశం కోసం చూస్తున్నాడు, ఈ క్రమంలోనే తన తండ్రి వద్ద పనిచేసిన కర్నాటకకు చెందిన మంజునాథ్ సాయం తీసుకున్నాడు. రఘుపతిని హత్య చేసేందుకు వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి గాను రూ.30లక్షలు చెల్లించేలా అంగీకారానికి వచ్చారు. మంజు నాథ్ హత్య చేసేందుకు కర్నాటకకు చెందిన తన స్నేహితులు రిజ్వాన్, భవిత్, మహ్మద్ సద్దిఖ్ అలియాస్ రాహద్, ఇస్మాయిల్, సమీర్ ఖాన్, సుమిత్, నేతాను సంప్రదించాడు.

కిరాయి హంతకుల ముఠా తయారు కాగానే శ్రీకాంత్ రెడ్డికి సమాచారం అందించాడు. వారికి ప్రధాన నిందితుడు షెల్టర్ ఇచ్చాడు. అక్కడి నుంచి పలుమార్లు రఘుపతిని హత్య చేసేందుకు ఇంటి వద్ద, దమ్మయిగూడ తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలోనే 15వ తేదీన బాధితుడిని వెంబడించిన నిందితులు అవకాశం రావడంతో వేటకొడవళ్లు, కత్తులతో పొడిచారు, తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి పరారైన నిందితులు శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి రెండుకార్లలో కర్నాటకు పారిపోయారు. హత్యకు వాడిన కత్తులను నిందితులు చెట్ల పొదళ్లల్లో పడేసిపోయారు. నిందితులను ఘట్‌కేసర్ సమీపంలోని కీసర ఓఆర్‌ఆర్ సమీపంలో కలిసి రూ.30లక్షలను అందజేశాడు. హత్య కేసు దర్యాప్తు చేసేందుకు నియమించిన ప్రత్యేక టీం సిసిటివి ఫుటేజ్, టెక్నికల్ డాటా సేకరించి నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్లు చద్రశేఖర్, మధుకుమార్, గురువా రెడ్డి, అశోక్‌రెడ్డి, ఎస్సైలు మోహన్, కౌశిక్, శివనాగప్రసాద్ తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News