Tuesday, January 7, 2025

మహిళ రేప్, హత్య కేసులో నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గత నెల 27వ తేదీన అత్యాచారానికి గురై హత్య గావింపబడ్డ మహిళ కేసులో ముగ్గురు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ డిసిపి సందీప్ తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం, మాల్దా జిల్లా, అష్రాపూర్, అడడంగాకు చెందిన శ్యామల్ రాయ్ నానక్‌రాంగూడలోని లేబర్ అడ్డాలో ఉంటూ సెంట్రింగ్ పనిచేస్తున్నాడు, అశోక్‌కుమార్ సర్కార్, అలోక్ సర్కార్ కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు. నానాక్‌రాంగూడ, వడ్డెరబస్తీకి చెందిన కాశమ్మ కన్పించకుండా పోవడంతో గత నెల 27వ తేదీన ఆమె కూతురు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే 29వ తేదీన కాశమ్మ మృతదేహం నిర్మాణంలో ఉన్న భవనంలో లభించింది.

మృతురాలిని గుర్తించిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలోపడ్డారు. లేబర్ అడ్డాల్లో విచారించగా శ్యామల్ రాయ్ కన్పించలేదు. వెంటనే పశ్చిమబెంగాల్‌కు వెళ్లిన గచ్చిబౌలి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి తీసుకుని వచ్చారు. నిందితుడిని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. బాధితురాలిపై శ్యామల్ అత్యాచారం చేసిన తర్వాత ఆమె చీరతో ఉరివేసి హత్య చేశాడు. తర్వాత ఈ విషయం తన స్నేహితులు అశోక్‌కుమార్, అలోక్ సర్కార్‌కు చెప్పాడు, వారు దానిని దాచారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ జేమ్స్ బాబు, డిఐ రాఘవేందర్, ఎస్సైలు మహేందర్‌రెడ్డి, పిసిలు రమేష్, శరణప్ప, మహిపాల్ రెడ్డి, యాదగిరి పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News