Saturday, April 26, 2025

ప్రియురాలి భర్తను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

Accused killed girlfriend's husband gets life imprisonment

తీర్పు చెప్పిన కోర్టు

హైదరాబాద్: ప్రియురాలి భర్తను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.11వేల జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. మొయినాబాద్ మండలం, ఎల్కగూడెం గ్రామానికి చెందిన ఆలూరు రాజు అదే గ్రామానికి చెందిన ఆలూరి లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం లక్ష్మి భర్త ఆలూరి ఎట్టయ్యకు తెలిసింది. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన నిందితులు లక్ష్మి, ఆలూరి రాజు, ఎండి అజహార్ పాషా కలిసి 4, ఫిబ్రవరి, 2013లో ఎట్టయ్యను హత్య చేశాడు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కోర్టులో సాక్షాలను ప్రవేశపెట్టగా వాటిని పరిశీలించి నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News