చెన్నైలో బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఇటీవల హత్యకు గురికావడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసుల్లో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. చెన్నై సమీపంలో పోలీస్‌ల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ మరణించాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో తిరువేంగడం ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. తిరువేంగడం చాలా రోజులు ఆర్మ్‌స్ట్రాంగ్ ను అనుసరించి ఆయన కార్యకలాపాల గురించి సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత హత్యకు ప్లాన్ చేశాడు.
జులై 5 సాయంత్రం చెన్నైలో బహిరంగంగా హత్య జరిగింది. మూడు బైక్‌లపై వచ్చిన హంతకులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. సంఘటన స్థలంలో పోలీస్‌లు పెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో నిందితుల్లో నలుగురు ఫుడ్ డెలివరీ కంపెనీ టీ షర్టులు ధరించి ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 8 మందిని అదుపు లోకి తీసుకున్నారు. వారిలో తిరువేంగడం ఒకరు.