అయోధ్య: ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసి కేసులో ప్రధాన నిందితుడు శుక్రవారం పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో మరణించగా అతని సహచరులు ఇద్దరు గాయపడినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు.
సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఆశిష్ శుక్రవారం అయోధ్యలోని పురా కాలందర్‌లో పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో గాయపడ్డాడు. ఆ తర్వుత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఎదురుకాల్పులలో గాయపడిన అతని సహచరులు ఆజాద్, విశంభర్ దయాళ్ దూబే ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఆగస్టు 30న సరయూ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కంపార్ట్‌మెంట్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో స్పృహలేని స్థితిలో కనిపించింది. ఆమెను లక్నోలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందచేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.
ఈ ఘటనపై అయోధ్యలో ప్రభుత్వ రైల్వే పోలీసులు(జిఆర్‌పి) కేసు నమోదు చేశారు. ఈ ఘటనను అలహాబాద్ హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టడంతో ప్రత్యేక టాస్క్ ఫోర్సు(ఎస్‌టిఎఫ్), స్థానిక పోలీసులు, జిఆర్‌పి సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేశాయి.