Thursday, January 23, 2025

మూసేవాలా హత్యకేసు నిందితుడు పరారు

- Advertisement -
- Advertisement -

Accused of Musewala murder case escaped

మాన్సా : పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు , గ్యాంగ్‌స్టర్ దీపక్ అలియాస్ టిను పోలీసు కస్టడీ నుంచి ఫరారయ్యాడు. శనివారం అర్థరాత్రి తరువాత ఈ ఘటన జరిగింది. కపర్తలా జైలునుంచి టినును జాతీయ దర్యాప్తు సంస్థ సిబ్బంది మాన్సాకు తీసుకువెళ్లుతుండగా అదును చూసుకుని ఈ నిందితుడు ఉడాయించాడు. ప్రధాన అనుమానితుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోకు దీపక్ సన్నిహితుడు. సిద్ధూ మూసేవాలా హత్య ఘటనలో మరింత దర్యాప్తు క్రమంలో ఈ నిందితుడిని జాగ్రత్తల నడుమనే తీసుకుని వెళ్లుతుండగా తప్పించుకోవడం కీలక పరిణామం అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News