Sunday, December 22, 2024

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలికను బెదిరించి అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ నాంపల్లి పోక్సో కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం… బాలిక తన గ్రాండ్ మదర్ వద్ద గత 15 ఏళ్ల నుంచి ఉండి చదువుకుంటోంది. సెలవుల సమయంలో తన తండ్రి ఉంటున్న అడ్జసెంట్ హౌస్‌కు వచ్చేది. అక్కడ పక్క ఇంటో అద్దెకు ఉంటున్న చింతల మాణిక్య(40) సెలవులకు వచ్చిన బాలికను నాలుగో తరగతి నుంచే అసభ్యంగా తిట్టడం, ప్రైవేట్ పార్ట్‌ను తాకడం చేసేవాడు.

ప్రతి ఏడాది ఇలాగే వ్యవహరిస్తున్నాడు, ఈ క్రమంలోనే బాలిక తండ్రి ఇంటి వద్ద స్నానం చేస్తుండగా నిందితుడు ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని బాలికకు చూపించి వాటిని యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. తనకు సహకరించకుంటే తండ్రి, సోదరుడిని చంపివేస్తానని బెదిరించడంతో బాలిక భయపడింది. దీనిని ఆసరాగా చేసుకున్న నిందితుడు 2018 నుంచి అత్యాచారం చేయడం ప్రారంభించాడు. ఈ విషయం బాలిక తన గ్రాండ్ మథర్‌కు చెప్పింది. దీంతో ఆమె చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు బాలికను భరోసా సెంటర్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్సై వెంకట్ కోర్టులో సాక్షాలను ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన కోర్టు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News