Friday, December 20, 2024

మెరీడియన్ హోటల్ కేసులో రిమాండ్‌కు నిందితులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః పెరుగు అడిగిన కస్టమర్‌పై దాడి చేసి హత్య చేసిన కేసులో మెరీడియన్ హోటల్ సిబ్బందిని అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. చాంద్రాయణగుట్టకు చెందిన లియాకత్ బిర్యానీ తినేందుకు ఆదివారం రాత్రి మెరీడియన్ హోటల్‌కు వచ్చాడు. బిర్యానీ తింటుండగా అదనంగా పెరుగు కావాలని సిబ్బందిని కోరారు. కానీ వాళ్లు ఎంతకు తేకపోవడంతో లియాకత్ వారితో గొడవపెట్టుకున్నాడు.

దీంతో ఒక్కసారిగా సిబ్బంది, మేనేజర్ వచ్చి లియకత్‌పై దాడి చేశారు. లియాకత్‌పై దాడి చేసిన కృష్ణసూర్య, పాండు, అలందార్, మెయిన్, అజీజ్‌ను అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో నిర్లక్షంగా వ్యవహరించిన ఎస్సై శివశంకర్, హెడ్‌కానిస్టేబుల్‌ను ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News