Thursday, January 23, 2025

సంధ్య హత్యకేసులో నిందితులకు రిమాండ్

- Advertisement -
- Advertisement -

కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఒడిపిలవంచ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన హత్యకేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కి పంపినట్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కాటారం పోలీస్ స్టేషన్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు హాజరుపర్చిన డీఎస్పీ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఒడిపివంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్‌కు కాటారం గ్రామానికి చెందిన సంధ్యకు 2017లో వివాహం జరిగిందని నాలుగేళ్ల పాటు వారిద్దరి కాపురం సజావుగానే సాగిందని ఈ మధ్య కాలంలో గణేష్ ఫర్టిలైజర్ దుకాణం పెట్టుకునేందుకు అదనంగా వరకట్నం తేవాలని భార్యను వేధిస్తుండేవాడు. దీనికి సంబంధించి ఆదివారం భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని రాత్రి సమయంలో సంధ్య బయటకు రావడం గమనించిన గణేష్ రోకలితో బలంగా కొట్టి చంపినట్లు తెలిపారు. సంధ్య హత్యకు కారకులైన గణేషతో పాటు అతని తల్లి కమలక్కపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. గణేష్ అక్కలు, బావలు మరో నలుగురిపై కేసు నమోదు అయినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో కాటారం ఎస్సై అభినవ్, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేష్, రవిందర్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News