Sunday, November 3, 2024

వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు: నిందితుడు సైఫ్‌కు బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల పిజి విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన అదే కళాశాలకు చెందిన రెండవ సంవత్సరం పిజి వైద్య విద్యార్థి డాక్టర్ మొహమ్మద్ సైఫ్‌కు వరంగల్ జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రూ. 10,000 పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని సైఫ్‌ను కోర్టు ఆదేశించింది. రానున్న 16 వారాలపాటు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ఎదుట హాజరుకావాలని కోర్టు బెయిల్ మంజూరు సందర్భంగా షరతు విధించింది. సాక్ష్యాలను నాశనం చేయడానికి, సాక్షులను బెదిరించడానికి ప్రయత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది.

కాకతీయ వైద్య కళాశాలలో అనెస్తీషియా విభాగంలో పిజి మొదటి సంవత్సరం చదువుతున్న డాక్టర్ డి ప్రీతి ఆత్మహత్య చేసకున్న విషయం తెలిసిందే. ఆమెను వేధించారన్న ఆరోపణపై అదే కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రీతిపై సైఫ్ వేధింపులకు పాల్పడినట్లు వాట్సాప్ చాట్ల విశ్లేషణ ద్వారా పోలీసులు కనుగొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News