Wednesday, January 22, 2025

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలుడిపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.9,000 జరిమానా విధిస్తూ నాంపల్లి, 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి అనిత గురువారం తీర్పు చెప్పారు. దబీర్‌పుర పోలీస్ స్టేషన్‌కు చెందిన బాలుడు ఏప్రిల్,13వ తేదీన ఇంటి బయట స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అదే కాలనీకి చెందిన కమల్ ఘోష్ అక్కడ ఆడుకుంటున్న పిల్లలను అక్కడి నుంచి పంపించి బాధిత బాలుడుకి చాక్లెట్ కొనిపిస్తానని తీసుకుని వెళ్లాడు.

సమీపంలోని షట్టర్‌లోకి బాలుడిని తీసుకుని వెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న రాములు అనే వ్యక్తి షట్టర్ నుంచి బాలుడి అరుపులు వినబడడంతో వెంటనే షటర్‌ను తెరిచాడు. వెంటనే బాలుడిని తీసుకుని నిందితుడు తన ఇంటికి వెళ్లాడు. అక్కడ బాలుడి తల్లి గురించి నిందితుడు అసభ్యంగా మాట్లాడాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన బాలుడు తల్లికి విషయం చెప్పడంతో దబీర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ కోటేశ్వరరావు సాక్షాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టడంతో వాటిని పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News