- Advertisement -
కొచ్చి: కేరళ లోని అలువలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార సంఘటనకు సంబంధించి నిందితుడు అష్‌ఫక్ ఆలమ్‌కు ఎర్నాకుళం పోక్సో కోర్టు మరణశిక్షను విధించింది. ఈ కేసులో జడ్జి కే సోమన్ తన తీర్పును మంగళవారం చిల్డ్రన్స్ డే సందర్భంగా తీర్పును వెలువరించారు. 110 రోజుల పాటు ఈ కేసులో వాదనలు సాగాయి.
ఇది అత్యంత అరుదైన కేసని, నిందితుడికి ఎలాంటి క్షమ అవసరం లేదని , సమాజానికి అతనో సమస్య అని కోర్టు తెలిపింది. ఆధారాలను ధ్వంసం చేసినందుకు అష్‌ఫక్‌కు ఐదేళ్లు జైలుశిక్ష విధించారు. మైనర్‌కు డ్రగ్స్ ఇచ్చినందుకు మూడేళ్ల శిక్ష, మైనర్‌ను రేప్ చేసినందుకు జీవితకాల శిక్ష, హత్య చేసినందుకు మరణశిక్ష విధిస్తున్నట్టు కోర్టు వివరించింది. రూ.7,70,000 జరిమానా చెల్లించాలని నిందితుడికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -