Wednesday, January 22, 2025

ఆర్‌టిసిని ముంచిన నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  తెలంగాణ ఆర్‌టిసిలో ప్రకటనల కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి వాటికి సంబంధించిన డబ్బులు కట్టకుండా ముంచడంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన వడ్డాను సునీల్ కుత్బుల్లాపూర్, చింతల్‌లో ఉంటున్నాడు. గో రూరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో యాడ్ ఏజెన్సీని ఏర్పాటు చేశాడు.

దీని తరఫున హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలోని ఆర్‌టిసిలో ప్రకటనల కోసం కాంట్రాక్ట్ తీసుకున్నాడు. వీటి ద్వారా సునీల్ ఆర్‌టిసికి హైదరాబాద్ రీజియన్‌లో రూ.10,74,89,006, సికింద్రాబాద్ రీజియన్‌లో రూ.10,97,38,389 బకాయి పడ్డాడు. ఆర్‌టిసి అధికారులు ఎన్నిసార్లు నోటీసులు పంపించినా కూడా నిందితుడు స్పందించకపోవడంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News