Sunday, December 22, 2024

తల్లిని చంపిన నిందితుడికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని కత్తితో పొడిచి చంపిన నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. నగరంలోని బల్కంపేటకు చెందిన సంగీత(50) ఇళ్లల్లో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తోంది. సంగీత కుమారుడు బెకండ సంతూ అలియాస్ బంజల్ సంతోష్ అలియాస్ బంటి మద్యానికి బానిసగా మారాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని తరచూ తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలోనే జనవరి 09, 2021న తల్లిని మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించాడు.

తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహం చెందిన నిందితుడు ఇంటి తలుపులు పెట్టి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలపాలయిన బాధితురాలు అక్కడిక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కోర్టులో సాక్షాలు ప్రవేశపెట్టడంతో వాటిని పరిశీలించిన జడ్జి జీవిత ఖైదు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News