Wednesday, December 25, 2024

గర్భిణికి ప్రసవం చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ..

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రభుత్వ అచ్చంపేట ఆసుపత్రికి వచ్చింది. గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని స్కానింగ్ లో తేలడంతో హై రిస్కు తీసుకోవడం ఎందుకని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలి అని ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో భయాందోళనలకు గురైన కుటుంబీకులు ఎమ్మెల్యే వంశీకృష్ణకు సమాచారం ఇచ్చారు.

వెంబడే ఆసుపత్రికి చేరుకొని ఆందోళన చెందవద్దని చెప్పి దగ్గరుండి.. ఆయనే తోటి వైద్యులతో కలిసి సిజేరియన్ చేశారు. ఆడ శిశువు జన్మించింది. తల్లిబిడ్డలు ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చి ప్రసవం చేసి తమను ఆదుకున్నందుకు.. గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపగా.. పలువురు ఎమ్మెల్యేను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News