Wednesday, April 16, 2025

ప్రేమపెళ్లి…. అచ్చంపేటలో యువకుడి తండ్రిని నడిరోడ్డుపై నరికి చంపారు

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడుంపల్లి సమీపంలో దారుణ హత్య జరిగింది. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నడుంపల్లికి చెందిన భూరం వీరయ్య (52) అచ్చంపేట నుంచి తన స్వగ్రామానికి వెళ్తుండగా నరికి చంపారు. భూరం వీరయ్యకు చెందిన కుమారుడు ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ జంట తనకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఇరుకుటుంబాలను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

యువతి కుటుంబం నుంచి ప్రాణహాని ఉండడంతో వేరే ప్రదేశంలో ప్రేమజంట తలదాచుకుంది. దీంతో యువతి కుటుంబ సభ్యులు భూరం వీరయ్య కుటుంబంపై పగ పెంచుకున్నారు. భూరం వీరయ్యను నడుంపల్లి గ్రామ శివారులో హత్య చేశారు. ఈ క్రమంలో భూరం వీరయ్యను యువతి కుటుంబ సభ్యులు హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News