హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు ‘ఆచార్య’. తాజాగా చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రిపోర్ట్.. ఆచార్య సినిమాకు టికెట్ ధరలు పెంచాల్సిన అవసరమేముందని అడిగిన ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి సమాధానమిస్తూ.. కరోనాతో అన్ని రంగాలు కుంటుపడ్డాయి. సినిమా రంగం కూడా నష్టపోయింది. మేం కూడా 42శాతం ట్యాక్స్ కడుతున్నాం. కరోనా వల్ల వడ్డీలు పెరిగి బడ్జెట్ కూడా పెరిగింది. టికెట్ ధరలపై ప్రభుత్వాల దగ్గర వేడుకుంటే తప్పులేదు అని పేర్కొన్నారు.
కాగా, ఈ సినిమాలో చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘Acharya’ Movie Unit Press Meet in Hyderabad