Wednesday, January 22, 2025

ఉగాది కానుకగా ఆచార్య

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1 విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ… ‘ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్నాం, కానీ కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. అందువల్ల సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నాం’ అని అన్నారు. ఉగాది కానుకగా ‘ఆచార్య’ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో, మేం కూడా అంతే ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నాము అన్నారు.

Acharya to release on April 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News