Monday, December 23, 2024

బిజెపిపై కీలక వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: బిజెపిపై టిడిపి ఎంఎల్ఎ కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి- వైసిపి మధ్య సంబంధం లేదని ప్రజలు అనుకోవాలని, అచ్చెన్నో…సునీల్ ధేవ్‌ధరో వేరేవరో అనుకుంటే ఫలితం లేదన్నారు. మనం చెప్పే మాటలను ప్రజలు నమ్మాలన్నారు. బిజెపి-వైసిపి మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకే తెలుసునన్నారు. ఏప్రిల్ 1న కేంద్రం ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులు నిర్ణయిస్తుందని, ఎఫ్‌ఆర్‌బిఎం వెసులుబాట్లలో ఏ రాష్ట్రానికి లేని అవకాశాలు ఎపికే వస్తున్నాయని, ఏప్రిల్ ఎపికి ఇవ్వాల్సిన అప్పును మార్చి నెలలోనే వచ్చేలా చేశారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News