Sunday, December 22, 2024

అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌సిపి రాక్షస జాతికి చెందిన పార్టీ అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్‌ఎ కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఓటమి భయంతోనే వైసిపి మూకలు నరమేధం సాగిస్తున్నాయని, టిడిపి నాయకులపై దాడులు చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గిద్దలూరు నియోజకవర్గం గడికోటలో టిడిపే మూలయ్య హత్యను ఖండిస్తున్నామన్నారు. చిలకలూరిపేట సభకు భారీగా ప్రజలను తరలించాడనే అక్కసుతో మూలయ్యను గొడ్డలితో నరికి చంపారని దుయ్యబట్టారు. మూలయ్య కుటుంబానికి టిడిపి అన్ని విధాలుగా ఆదుకుటుందని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. సొంత బాబాయ్‌ని గొడ్డలితో నరికి చంపిన నాయకులను వైసిసి కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారని మండిపడ్డారు. వైసిపికి ఫ్యాన్ గుర్తు రద్దు చేసి గొడ్డలి గుర్తును ఆ పార్టీకి కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News