Monday, December 23, 2024

హరిత తెలంగాణ సాధనే లక్షం

- Advertisement -
- Advertisement -

రామగుండం కార్పొరేషన్: హరిత తెలంగాణ సాధనే లక్షంగా గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవంను పురస్కరించుకొని రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్‌ఎఫ్‌సిఎల్ ఆవరణలో మొక్కలు నాటి 9వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో మొక్కలు నాటిన పేర్లు అశోకుడికి ఉం డేదని, వర్తమానంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలనే లక్షంతో హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారని, ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలిపారు.

ప్రతి మున్సిపాలిటీలో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించి మొక్కలు పెంపకం కోసమే ఉపయోగించేలా చట్టం సైతం చేశారని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. అనంతరం ఆర్‌ఎఫ్‌సిఎల్ ఆవరణలో ము న్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్‌పిలు, స్వశకి మహిళల సహకరాంతో వెయ్యి మొక్కలు నాటారు.

కార్యక్రమంలో నగర కమీషనర్ బి.సుమన్ రావు, కార్పొరేటర్లు నీల పద్మ గణేష్, కుమ్మరి శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, బాలరాజ్‌కుమార్, ఎస్‌ఇ చినాన రావు, ఇఇ సుచరణ్, డిఇ రవి కుమార్, ఎఇలు జమీల్, తేజశ్విని, షాబాజ్, మున్సిపల్ సూపరింటెండెంట్ మనోహర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News