Sunday, December 22, 2024

ఆ యూనివర్సిటీలో విద్యార్థినిపై యాసిడ్ దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాలేజీలో జరుగుతున్న ఓ వేడుకలో విద్యార్థినిపై యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో సంభవించింది. ఇక్ఫాయ్ యూనివర్సిటీలోని ఓ కాలేజీలో వేడుకలు జరుగుతుండగా రంగు నీళ్లతో ఆటలు ఆడుకుంటున్నారు. రంగు నీళ్లకు బదులుగా ఓ బాకెట్ లో యాసిడ్ కొందరు విద్యార్థులు యాసిడ్‌ను లేఖ అనే విద్యార్థినిపై పోయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసియులో చికిత్స పొందుతుందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కావాలని సదురు విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News