Monday, December 23, 2024

మహిళపై యాసిడ్ దాడి….

- Advertisement -
- Advertisement -

Acid attack on women in Karnataka

బెంగళూరు: 24 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని సుంకద్‌కట్టే ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నాగేష్ అనే వ్యక్తి వస్త్ర దుకాణంలో పని చేసేవాడు. నాగేష్‌కు 24 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను పలుమార్లు పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. గత బుధవారం సాయంత్రం ఆమె ఉద్యోగం చేసే ఆఫీస్‌కు వచ్చి పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఆమె సహా ఉద్యోగులు నాగేష్‌ను ఆఫీస్ పరిసరాల నుంచి బయటకు పంపించారు. గురువారం ఉదయం ఆఫీస్ సమీపంలో ఆమె కోసం ఎదురు చూశాడు. ఆమె ఆఫీస్ గేటు దగ్గరకు రాగాను ఆమెపై యాసిడితో దాడి చేశాడు. వెంటనే నాగేష్ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఛాతీ, వీపు, తల భాగంలో గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్‌పి ఎం సంజీవ్ పాటిల్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News