- Advertisement -
ఖమ్మం నగరంలో ఒక ప్రేమోన్మాది తనను ప్రేమించడం లేదని ఒక యువతి పై యాసిడ్ తో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఖమ్మం నగరంలో శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉండే గణేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన శ్రావణి అనే యువతిని ప్రేమిస్తున్నట్లు గత కొంతకాలంగా ఆమె వెంట పడ్డారు. ఖమ్మం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ కోర్స్ చదువుతున్న శ్రావణి నీ పలుమార్లు అడ్డుకొని ప్రేమ పేరుతో వేధించాడు.
సంక్రాంతి పండుగ రోజు అంటే ఈ నెల 14వ తేదీన రాత్రి ఇంటి ముందు ముగ్గు వేస్తున్న శ్రావణి పై గణేష్ యాసిడ్ తో దాడి చేయడానికి ప్రయత్నం చేయగా ఆమే తన చెయ్యి ని అడ్డం పెట్టడంతో చేయి పై యాసిడ్ పడి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ప్రస్తుతం శ్రావణి ఆమె ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు.
- Advertisement -